15, జూన్ 2013, శనివారం

ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం

ఆఫీసు నుండి ఇంటికి వస్తూ ఏదో కొందామని రోడ్డు వైపునున్న చిన్న షాప్ దగ్గర ఆగాను, నేను డబ్బులు ఇస్తూ వుండగా తెల్లగా, బక్క పల్చగా వున్న వ్యక్తి వచ్చాడు.  వచ్చి రావడంతోనే షాప్ ఓనర్ తో  "ఏమైయ్యా ఇది ఏమైనా మర్యాదగా వుందా" అని మొదలుపెట్టి  కాస్త అమర్యాదైన భాషలోకి దిగాడు.ఇంకో ఐదు నిముషాలు వింటే గాని  అర్థం కాలేదు అసలు సంగతి . ఆ వ్యక్తీ షాప్ ఓనర్ కి అప్పు ఇచ్చినట్టున్న్నాడు, ప్రతిరోజు ఇంత చొప్పున వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలి, ఇవ్వని రోజున ఇలాంటి  తిట్లు చిన్న షాప్ వాళ్ళకి తప్పవు. "ఈరోజు ఇవ్వలేనండి "చలో అసెంబ్లీ" వాళ్ళ ఇవ్వాల షాప్ పెద్దగ అమ్మలేదు,రేపు మళ్లి బంద్ అంటున్నారు , అన్ని కలిపి ఆదివారం ఇస్తానండి" అన్నాడు షాప్ ఓనర్, కష్టపడి  నిజాయితీగా బ్రతికే మనిషిలాగా కనిపిస్తున్నాడు , కానీ అప్పించిన వ్యక్తి వినే పరిస్టితిలో  లేడు "అవన్నీ చెప్పకు నాకు గంటలో వస్తాను డబ్బులు సిద్దంగా  ఉంచు" అని కరకుగా చెప్పి వెళ్ళాడు.

మెల్లగా మొదలైన వర్షంలాగా నాలో ఈ ఆలోచన పెద్దగయి కొంచెం బాధ పెట్టడం మొదలైంది, మనలో కొందరికి బంద్ అంటె అసహ్యం -దాన్ని ఒక రాజకీయ కుల్లులో  భాగంగా చూస్తాం, కొంతమందికి ఆనందం హాయిగా ఇంట్లో కూర్చోని టీవీ చూస్తూ కెసిఆర్ ,రాజగోపాల్ ను తిట్టుకోవచ్చు. కానీ, చెల్లి పెళ్లికో, నాన్న వైద్యానికో ఇల్లు పొలం అమ్మి ఉళ్ళో చేసేదేంలేక హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు ,పనులు చూసుకొనే వేలాది మంది సామాన్యులకు భయం. సంవత్సరాలుగా ఈ బంద్ లతో సాధించింది ఏమిటి?ప్రజలను మరింత దుర్బర పరిస్టితుల్లోకి  నెట్టడం తప్ప, స్వతంత్ర భారతాన్ని అపహాస్యం చేయడం తప్ప ? చిన్నప్పుడు చదివిన నారాయణరెడ్డి గారి కవిత మళ్లీ మళ్లీ గుర్తుకువచ్చి గుండెను మెలి తిప్పుతుంది




అందరూ తనవాళ్ళే ఆయినా ......  అ కుమ్ములాట ఎందుకని 
చిందుల మధ్య అనాధ శిశువులా చితికి పోతుంది స్వాతంత్రం 

"The more educated we are,the more biased we become, " ని నిజం చేస్తూ మేధావులు అనబడే వారుతెలంగాణా ,ఆంధ్ర అని  రెండు వైపులా విడిపోయి మీరు తప్పంటే మీరు తప్పని తమ గొప్పని నిరుపించుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ప్రజల జీవితాన్ని మెరుగుపరిచే నిర్ణయం ఏదీ అని ఆలోచించే నాథుడు లేడు. మరో వైపు గత 50 సంవత్సరాల్లో నిరాహార దీక్ష్య చేస్తూ ప్రజల కోసం ప్రాణమిచ్చిన ఒక్క నాయకుడు లేడాయే . 

వేలాది పసిమొగ్గలు పుట్టిన నెలరోజుల్లోనే కనుమూస్తుంటే,వందలాదిమంది రైతులు సాగు చేసే పొలంలోనే పురుగుల మందులు తాగుతుంటే తెలంగానానో,శ్రీకాకుళం  నో ,వరంగల్ నో ప్రత్యేక రాష్త్రం చేస్తే వచ్చే లాభం ఏంటి ? అత్యంత హేయమైన అవినీతి యంత్రాగం,రాజకీయనాయకులు మరానప్పుడు వంద రాష్త్రాలు చేసినా ప్రజలకు ఒరిగేది ఏంటి? ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకోవడానికి లంచం ఇవ్వడం తప్పుతుందా? వందలాది కోట్ల రూపాయలు మేస్తున్న పందికొక్కులు రాత్రికి  రాత్రి సాధువులవుతరా?

మరి దేనికోసం ఇంతమంది ప్రజలు కెసిఆర్ కు మద్దతు పలుకుతున్నారు? రాష్త్రం రావణకాష్టం ఎందుకు అవుతోంది ? జనాలకు చిన్న ఆశ , తమ పిల్లలకు నాలుగు ఉద్యోగాలు వస్తాయేమోనని, తమ పొలాలకు  నీళ్ళ సౌకర్యం దొరుకుతున్దేమనై ఆశ - దీన్ని గుర్తించకుండా తెలంగాణా ప్రజలకు పని లేదు అస్తమానం రోడ్లపైకి వస్తరనొ ,ఆంధ్ర ప్రజలు దుర్మార్గులు వచ్చే రాష్స్త్రాని అడ్డుకున్టున్నారో అని తిట్టుకోవడం భావ్యం కాదు. మర్యాదలు మరిచి పరస్పరం దూషించుకోవటం దుర్మార్గం ,అల చేసుకుంటూ పోతే అన్నమయ్య ని ఆంధ్రకు ,పోతనను తెఅలంగానకు విభాజించికుంకు పొగలమా? "నిఖిలలోకమెట్ల నిర్ణయించిన తిరుగులేదు నాకు విశ్వనరుడ నేను" అన్న జాషువా ఎవరివాడవుతాడు . ఇందుకేనా 20 సంవత్సరాలు నిండని యువకులు ప్రాణాలు ఇచ్చింది? ఇదేనా ఆ ఉరి తీయబడ్డ శిరస్సులు చెప్పిన రహస్యం, ఈ రకంగా నేనా భారత ధాత్రి ఋణం తీరుకునేది ? కొడుకులు విడిపోయి తల్లులని వృద్ధ్రశ్రమాల్లో చేర్చే సంస్కృతి మనకు కొత్తకాకపోయినా "స్వతంత్ర భారత ధాత్రి ని" చేర్చగలిగే వ్రుద్ధ్రాశ్రమం ఎక్కడని వెతుకుతాం?