29, జులై 2013, సోమవారం

వెంటాడే మాటలు

 చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటం అలవాటయింది , ఆ మరి మాకు ముప్పయేల్లు వచ్చాక అయ్యిందా? అంటారా ,నేను చెప్పేది పాఠ్య పుస్తకాలూ కాకుండా కథలు,కవితల గురుంచి   అదో   వ్యసనం అయ్యింది.తర్వాత చాలామంది స్నేహుతులకు అంటించా  లెండి.   9 వ తరగతిలో వుండగా అనుకుంటాను  నారాయణ రెడ్డి గారి "విశ్వంభర" కొన్నాను,   తర్వాత తిలక్ " అమృతం కురిసిన రాత్రి". మళ్లి మళ్లీ చదవటం వల్ల చాలావరకు నోటికీ వచ్చేవి. సరిగ్గా గుర్తు లేదు గానీ విశ్వంభర ఒపెనింగె మహేష్ బాబు సినిమాల చాలా బాగుంటుంది - పుస్తకం మరొక్క సరి తీస్తే మరింత సరిగ్గా రాయగలననుకుంట ,  ట్రై  చేస్తాను . 
ఇవన్నీ, నిద్రలో, బాధలో, సంతోషంలో  irrespective of any feeling - నన్ను వెంటాడుతాయి
                            "నువ్వు  పుట్టక ముందే తల మీద నీలితెర 
                               కాళ్ళ కింద దూలిపొర" 

అని  మొదలు పెట్టి  - 
                                              " చీకటి మూకల  మధ్య , రక్కసితనం పెంచుకున్నఉక్కు కాకుల మధ్య"  

అని ఇప్పటికి ఎప్పటికి సరిపోయే లోక వర్ణన చేస్తారు సినారె.   

జీసస్ ను శిలువ  వేసే సందర్భాన్ని - 

"పడమటి కొయ్యకు బంధించి , పదును చీకట్ల మేకులు దించి 
నల్లనల్లగా నవ్వింది అజ్ఞానం" అని వెలుగు పై చీకటి   యొక్క తాత్కాలిక విజయం తో పోల్చుతారు . 

తిలక్  గారు -

 secularism గురుంచి టీవీ లోనో , పత్రికలోనో చూసినప్పుడల్లా, మతం ప్రస్తావన వచ్చినప్పుడల్లా
"ఏ దేశ సంస్కృతి కాదు ఒక స్టిర బింధువు 
అది అనేక నదీనదాలు కలిసిన అంతస్సింధువు"

అనే మాట గుర్తుకు వస్తుంది - మా దేశం మంచిది,మన దేశమే మంచిది అన్న భావన కలిగినప్పుడల్లా 

"శ్రీరాముడి శ్రీకృష్ణుడి జన్మస్తానం, మరి కంసుడికి , దశకంతుడికి కాదా? అని ప్రశ్నిస్తుంది  

వీటన్నికన్న ఎప్పుడో ఏదో తెలుగు పత్రికలో చదివిన కవిత తీవ్రంగా వెంటాడుతుంది , కనీసం ఇది ఎక్కడ వ్రాసుకోలేదు కుడా - దాంట్లో వున్న తీవ్రత వల్ల కావచ్చు సగం మాత్రం ఇంకా గుర్తుంది , అదే మళ్లీ మళ్లీ వెంటాడుతుంది 

            చీకటివై ,సిగరెట్ వై,సీసావై కరిగిపోతావో , కాలిపోతావో 
           నలుగ్గోడలే కదా సాక్ష్యం 
          దుఃఖం  వైతరినిలో సైతం ధిక్కార చుక్కానివై సాగుతావ్ 
          నీకన్ని అవసరాలే , అన్నీ అవరోధాలే    
          శిరసెత్తి నిల్చున్న పత్రకరుడా ... సిరమొంచి చెప్తున్నా 
         దుఃఖం నువ్వే , వోదార్పు నువ్వే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి