23, జులై 2013, మంగళవారం

మిథిలా నగరంలో సీత స్వయంవరం by ధాత్రి

ధాత్రి ఎవరో కొత్త రచయిత్రి అనుకొనేరు, ధాత్రి అనే పేరుతో సీత స్వయంవరం ఎవరు రాయలేదు, సినిమా కూడా తీయలేదండి, ధాత్రి మా అమ్మాయి పేరు. మీకు మరో విషయం చెప్పాలి , నేను ధాత్రి అని పిలిస్తే తనకు కోపం వస్తుంది ,నాపై అరిచి, నాన్న.. ఎన్నిసార్లు చెప్పాలి, నా పేరు ధాత్రి ఆచార్య, పూర్తి పేరు చెప్పాలి అంటుంది. ఇంత స్పృష్టంగా పలక లేక పోయిన దాని అర్థం మాత్రం అదే.ఆమె వాళ్ళమ్మ బొజ్జలో  ఉన్నప్పటి నుండి ఈరోజుకి వరకు దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు, ప్రతీ రోజు మమ్మల్నిఏదో ఒకరకంగా సర్ప్రైజు చేస్తూనే వుంది. ఆమె పుట్టిన రోజే ఒక పెద్ద సర్ప్రైజ్, ఒక రోజు నేను మాములుగా ఆఫీసు బయల్దేరే ముందు నా అర్దాంగి (అదేనండి తెలుగులో "వైఫ్") నాతో "పొట్టలో కాస్త నొప్పిగా వుంది" హాస్పిటల్ వెళదామా" అంది, డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ కి టైం వుంది,ఇప్పుడు ఇలా ఎందుకు అవుతోంది అనుకుంటూనే హాస్పిటల్ కి వెళ్ళాము,అర్థగంట తర్వాత  వచ్చిన డాక్టర్ ...డెలివరీ అయ్యేలా వుంది ,జాయిన్ చెయ్యండి అని చెప్పటంతో కాస్త కంగారు మొదలైంది, ఇంట్లో ఎవ్వరు లేరు, రెండు రోజుల క్రితమే వాళ్ళమ్మ ఊళ్ళో ఏదో పని వుంది చూసుకుని రెండు రోజుల్లో వస్తానని వెళ్ళారు, వరంగల్ కి పంపించమని మా అమ్మ ఎంత పోరుపెట్టిన నేను పంపించ లేదు, మా నాన్నని, అయన నలభీమపాక నైపుణ్యాన్నినమ్మి  మా అమ్మ హైదరాబాద్ రాలేరు -పెద్దవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి కొంచెం భయం, మరోవైపు ఉద్విగ్నత.  హాస్పిటల్ కి వచ్చిన విషయం ఎవరికీ  చెప్పలేదు,సాయంత్రం ఎనిమిది గంటల పదినిమిషాలకు ధాత్రి గారు వచ్చేసారు, కొద్దిసేపటి తర్వాత నాచేతుల్లోకి వచ్చేసారు, అవి మరపు రాని క్షణాలు (నాలాంటి అనుభవం చాలా మంది తండ్రులకి వుంటుంది - దురదృష్టం ఏంటంటే సినిమాల్లో ఎక్కువగా ఇలా తండ్రులు ఆనందపడే సందర్భాలు తక్కువ ),అంతవరకు నేనెప్పుడు ఒక రోజు వయస్సున్న పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకొలెదు, బహుశ చూడను లేదు. మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను, అదేంటి నాన్న ఇంకా డెలివరీ కి టైం వుంది కదరా, కనీసం పొద్దున్న ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా, మేము వచ్చేవరకు ఎలా? అని మా అమ్మ తిట్టడానికి రెడీ అవుతుంటే, అబ్బా...అమ్మా... విలాసినికి (నా కజిన్) ఫోన్ చేశాను, వచ్చింది,  నా బిడ్డకి నాలాగే తొందరెక్కువ 20 రోజుల ముందే పుట్టింది అని టాపిక్ మర్చి కూల్ చేశాను. ఆ రోజు నుండి ఇంట్లో ధాత్రి గారే మోస్ట్ వాంటెడ్,మోస్ట్ respected, మోస్ట్ ఇంపార్టెంట్.ఏది చేయాలన్న,చెయ్యొద్దన్నధాత్రి గారి కోణంలోంచి ఆలోచించాలి.

పుస్తకాలూ,క్రికెట్,రాజకీయాలు ఇలా రకరకాల పిచ్చితానాల మధ్య బ్రతికే నేను మా ఆవిడని,అమ్మాయిని ఎలా చూసుకుంటానో అని  మా అమ్మకి ఒకటే బాధ, నా ఫ్రెండ్స్ నన్ను అంకుల్ అని పిలవడం మొదలుపెట్టడం జరిగిపోయింది, దాదాపు 10 రోజుల వరకు ఎవరో ఒకరు ఫోన్ చేసి కంగ్రాట్స్చెప్పేవారు, ఫోన్ వచ్చిన ప్రతిసారి నాకు భయం, ఎందుకంటే వచ్చే ప్రతి పది ఫోన్లలో 5 కొత్త నంబర్లే, ఫోన్ ఎత్తి నమస్తే ఎవరండి మీరు అని అడగలలేక, నన్నునేనే తిట్టుకోలేక నానా అవస్తలు, చుట్టాలతో రిలేషన్స్ మైంటైన్ చేయడంలో మనం కొంచెం వీక్.మరోవైపు ఆఫీసులో నా టీం ఇదివరకన్నచాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, విషయం ఏంటని ఆలోచిస్తే అసలు విషయం తట్టింది, నేను ప్రతిరోజు ఆఫీసు నుండి టంచనుగా 7 PM కి బయల్దేతున్నాను, ఇంతకుముందుల ఎనిమిదిన్నర వరకు వుండటం లేదు కాబట్టి, నా టీం కూడా హ్యాపీగా టైంకి ఇంటికి వెళుతున్నారు. అందువలన నాకో చిన్నజ్ఞానోదయం అయ్యింది, బాస్ కి కొత్తగా పెళ్లి అయిన, కొడుకో,కూతురో పుట్టినా బాస్ తో పాటు అతని టీం కూడా ఆనందపడుతుంది. సీత స్వయంవరంలో ఈ పిడకల వేట ఎంటని అనుకుంటున్నారా, అక్కడికే వస్తున్నా.


ధాత్రి గారి రెండవ పుట్టిన రోజు అయిన తర్వాత మాకు కొత్త కష్టాలు వచ్చాయి, రోజు భుజంపై  వేసుకుని పాటలు పాడితేనే నిద్రపోయేది,ప్రతిరోజు అర్థగంట నుండి గంట సేపటి వరకు రోజూ పాతవి,కొత్తవి అని తేడాలేకుండా పాడి నిద్రపుచ్చడానికి నానా కష్టాలు పడేవాన్ని, ఒకరోజు అదేపనిలో వుండగా నా శ్రీమతి వచ్చి నీ కష్టాలు తగ్గే మార్గం చెప్పనా అంటే, చిన్న పిల్లాడికి ఒకేసారి వంద 5 star chocolates ఇస్తానని ఎవరైనా చెప్తే పడేంత ఆనందపడి ఎమిటా ఉపాయం అని అడిగాను, తను మెల్లగా, నువ్వు పాడితే అది నిద్రపోవటం లేదు, దాని నిద్ర పాడైపోతోంది,కాబట్టి పాటలు మానేసి కథలు చెప్పండి అంది. నా గాన కౌశలన్ని అంతగా పొగిడిన మా ఆవిడకు ఓ నమస్కారం చెప్పి కథలు చెప్పటం మొదలు పెట్టాను ఆ రోజునుండి, విచిత్రం చాలా తొందరగా నిద్రపోయేది.మనం  HR లో పని చేస్తాం, చదివింది అదే కాబట్టి కథలు చెప్పటంలో కాస్తా స్కిల్స్ ఎక్కువ, ఆ రోజునుండి నాకు ఎదురులేకున్డపోయింది.ఒక చిన్నపిట్ట అని మొదలు పెట్టి రకరకాల పిట్ట కథలు చెప్పే వాన్ని, అది స్కూల్ కి వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత, పిట్ట అని మొదలు పెట్టాగానే...బ్లూ పిట్టా?అరేంజ్ పిట్ట డాడీ అని అడిగేది, ఏదో కలర్తో మేనేజ్ చేసి కథ  పూర్తి చేసేవాన్ని.పాపం కొన్ని రోజుల నా కథలతో బోర్ కొట్టి వాళ్ళమ్మను కథలు చెప్పమని అడిగేది.నా కష్టాలు మా ఆవిడకి ట్రాన్స్ఫార్ చేసి నేను హాయిగా చదువుకొనే వాన్ని.


ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి రాగానే నా దగ్గరికి వచ్చి నాన్న.. మమ్మీ ఈ రోజు కొత్త కథ చెప్పింది, నేను నీకు చెప్పన అని అడిగింది, సూపర్ నన్ను కథలు చెప్పమని అడగటం తప్ప ఇంకా ఏమైనా అడుగు తల్లి,ఇంతసేపు  ఆఫీసులో చాల మందికి కథలు చెప్పి అలసి పోయాను అని చెప్పి తనను నా పై కుర్చోపెట్టుకున్న, మెల్లగా మొదలు పెట్టి ఏదో కథ చెపుతోంది, చాలాసార్లు విన్న కథలా వుంది, దశరథ మహారాజు పేరు, రాముని పేరు మాత్రం వినబడింది, ఇదేదో అద్భుతంలా వుందని, మళ్లి చెప్పమనగానే దసరథ మహారాజు నుంచి మొదలు పెట్టి,మిథిలా నగరంలో సీత స్వయంవరం, అడవికి వెళ్ళటం, ఆంజనేయస్వామీ, రావణున్ని చంపటం, పట్టాభిషేకం ఇలా ఏది వదలకుండా రామాయణం మొత్తం రెండు నిమిషాల్లో చెప్పింది.. చాలా ఆనందంగా అనిపించింది, భవిష్యత్లో నా కూతురుకి నెలకు కోటి రూపాయల   ఉద్యోగం వచ్చినా అంత ఆనందం కలగదేమో.రామాయణం పైన వుంటే ఇష్టం వల్లనో, సీత పై వుండే భక్తి వల్లనో , ofcourse సీతమ్మ పై వుండే భక్తివల్లనే.రాముడిక్కన్న సీతమ్మ అంటేనే చాలా భక్తీ, బహుశా ఆమె ధైర్యం, మహారాజు బిడ్డ అయినప్పటికీ రాముడి మాటకోసం ఆమె అడవిలో పడిన కష్టాలు, పిల్లలను పెంచిన తీరు, రామాయణంలో సీత పాత్ర చిత్రణ కంటే మరో అద్భుతం లేదు.


అప్పుడే నిర్ణయించుకున్నాను నా బిడ్డకి పది  ఏళ్ళు వచ్చిన తర్వాత రామాయణం మొత్తం వివరంగా చెప్పాలి అని,సీత ధైర్యం గురుంచి చెప్పాలి, సీత లేదంటే రామాయణమే లేదనే నిజాన్ని చెప్పాలి, రావణున్ని చంపటం వల్ల రాముడు దేవుడు కాలేదు, సీత భర్త కావటం వల్ల అయ్యాడు అన్ననిజం చెప్పాలి.సీత పుట్టిన దేశంలో అమ్మాయిలకి అమ్మ గర్భంతో సహా ఏది భద్రమైన ప్రదేశం కాదని చెప్పాలి, ఆడపిల్లకి జన్మ ఇవ్వడానికి, పెంచడానికి, స్వేఛ్చ ఇవ్వడానికి ధైర్యం లేని కర్మభూమి మనది అనే విషతుల్యమైన నిజాన్ని చెప్పాలి, సీతమ్మకు రావణుడి ఒక్కడితోనే భయం, ఇప్పుడీ దేశంలో నిమిషానికీ ఒక నిర్భయను చంపేస్తున్నారు అన్నదుఃఖాన్నిచెప్పాలి.నా బిడ్డకు బోల్డ్ గ వుండటం నేర్పటం కోసం చెప్పాలి.


4 కామెంట్‌లు:

  1. బావున్నాయండీ మీ అమ్మాయి కబుర్లు. చదువుతుంటే తనను చూడగలిగితే బావుండు కదా అనిపించింది.

    ఇంతకూ మీరు కొత్తగా బ్లాగ్ మొదలుపెట్టారా? రెండే పోస్ట్స్ కనబడుతున్నాయి.. నాకేమో ఇంతకూ మీ బ్లాగ్ లో ఇంకేవో చదివినట్లు గుర్తు? ఏదైతే అదైంది. మీ పోస్ట్స్ రెండిటిలోనూ సామాజిక స్పృహ, ఆవేదన కనబడుతున్నాయి. బాగా రాస్తున్నారు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా థాంక్స్ ప్రియ గారు, తెలుగులో బ్లాగ్ ఈ మధ్యే మొదలు పెట్టాను.
      మరో పోస్ట్ లో మా అమ్మాయి ఫోటో తప్పకుండా పెడతాను :-)

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. థాంక్స్ అనామిక గారు, మీ బ్లాగ్ బాగుంది, వీకెండ్ లో అన్ని పోస్ట్ లు చదవలనే ప్లాన్ చేశాను

      తొలగించండి